ఎండల తీవ్రత.. వడదెబ్బతో ఆరుగురి మృతి

50చూసినవారు
ఎండల తీవ్రత.. వడదెబ్బతో ఆరుగురి మృతి
తెలంగాణలో వడదెబ్బకు గురై శనివారం ఆరుగురు మృతి చెందారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో గుర్తుతెలియని వ్యక్తి(35) ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందారు. హనుమకొండ జిల్లా పెంచికల్‌పేట్‌కు చెందిన తొగరు ఐలయ్య(85), కరీంనగర్‌ గంజ్‌ ప్రాంతంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి(50) మృతిచెందారు. గంగాధర మండలం గర్శకుర్తిలో చిందం అన్నవ్వ(86), మంచిర్యాల జిల్లా భీమారంలో అరెకిల్ల సంపత్‌(45), ములుగు జిల్లా కమలాపురంలో కోరుకొండ ఆనంద్‌(65) తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందారు.

సంబంధిత పోస్ట్