విద్యార్థుల ఫోన్‌లకే ఇంటర్‌ హాల్‌టికెట్లు

68చూసినవారు
విద్యార్థుల ఫోన్‌లకే ఇంటర్‌ హాల్‌టికెట్లు
తెలంగాణలో విద్యార్థుల ఫోన్లకే ఈ ఏడాది ఇంటర్మీడియట్‌ హాల్‌టికెట్లు రానున్నాయి. విద్యార్థులు ఇచ్చిన మొబైల్‌ ఫోన్‌ నంబర్లకు లింక్‌ పంపిస్తున్నారు. దాన్ని క్లిక్‌ చేస్తే హాల్‌టికెట్‌ వస్తుందని, డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఓ అధికారి తెలిపారు. గురువారం నుంచి ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంటర్నల్‌ పరీక్షలు ఉన్నందున ఇప్పటికే పంపించామని, సెకండియర్ విద్యార్థులకు ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్స్‌ ఉన్నందున త్వరలో పంపిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్