చిన్న మొత్తాలపై వడ్డీ రేట్లు యధాతథం

63చూసినవారు
చిన్న మొత్తాలపై వడ్డీ రేట్లు యధాతథం
ఆర్థిక సంవత్సరం (2024-25) ఏప్రిల్- జూన్ మొదటి త్రైమాసికానికి పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY) సహా ప్రభుత్వం అందిస్తున్న చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీరేట్లను యధాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. SSYపై 8.2%, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌ పై 7.1%, సేవింగ్స్ డిపాజిట్‌పై 4.0%, కిసాన్ వికాస్‌పత్రపై 7.5%, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) 7.7%, మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌పై 7.4% వడ్డీ కొనసాగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్