రూ.404 లక్షల కోట్లకు చేరిన మదుపర్ల సంపద

80చూసినవారు
రూ.404 లక్షల కోట్లకు చేరిన మదుపర్ల సంపద
కొనుగోళ్ల జోరుతో వరుసగా 5వ రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్‌ మళ్లీ 74,000 పాయింట్ల పైకి చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 5 పై. పెరిగి 83.28 వద్ద ముగిసింది. మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ గత 5 ట్రేడింగ్‌ రోజుల్లో రూ.11.29 లక్షల కోట్లు పెరిగి, తాజా గరిష్ఠ రికార్డు రూ.404.18 లక్షల కోట్లకు చేరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్