ఇరాన్‌లో జూన్ 28న అధ్యక్ష ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. హెలికాప్టర్ ప్రమాదంలో ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నూతన అధ్యక్షుడి ఎన్నికకు ప్రభుత్వం నిర్ణయించిందని స్థానిక మీడియా తెలిపింది. కాగా ఇరాన్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు మరణించిన 50 రోజుల్లో
ఎన్నికలు నిర్వహించేందుకు దేశంలోని ముగ్గురు అగ్రశ్రేణి అధికారులు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.