రైతు రుణ మాఫీ సాధ్యం అవుతుందా..!

82చూసినవారు
రైతు రుణ మాఫీ సాధ్యం అవుతుందా..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ ఏకకాలంలో చేస్తామని స్పష్టం చేసింది. అయితే నిజంగానే రుణ మాఫీ సాధ్యం అవుతుందా..? ప్రభుత్వం వద్ద అంత డబ్బు ఉందా అని చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రుణ మాఫీ చేయాలంటే రూ.30 వేల కోట్లకు పైగా నిధులు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో రైతు రుణ మాఫీకే నిధులు కేటాయిస్తే ఇతర పథకాలకు నిధులు కొరత ఉండే అవకాశం ఉంది. అయితే ఆగ‌స్ట్ 15లోపు రైతు రుణ మాఫీ చేస్తామ‌ని సీఎం రేవంత్ స్ప‌ష్టంగా చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్