2023 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపుతో బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. ఓటమి తర్వాత కేసీఆర్ ఇంటికే పరిమితమయ్యారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కేటీఆర్.. ప్రభుత్వ పథకాల అమలులో లోపాలను తీవ్రంగా ఎండగడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పగ్గాలు కేటీఆర్ చేతికి రానున్నట్లు తెలుస్తోంది. పార్టీ తరపున ఇప్పటికే అన్ని కార్యక్రమాలు KTR చేతుల మీదుగా జరుగుతుండటంతో ఈ వాదన మరింత బలపడుతోంది.