జగన్ బుద్ధి మారట్లేదు: మంత్రి లోకేశ్

56చూసినవారు
జగన్ బుద్ధి మారట్లేదు: మంత్రి లోకేశ్
AP: జనం ఛీ కొట్టినా మాజీ సీఎం జగన్ హత్యా రాజకీయాలు మానడం లేదని మంత్రి లోకేశ్ విమర్శించారు. వైసీపీ రౌడీల దాడిలో మృతిచెందిన చిత్తూరు జిల్లా కృష్ణాపురానికి చెందిన టీడీపీ కార్యకర్త రామకృష్ణకు మంత్రి లోకేష్ కన్నీటి నివాళులు అర్పించారు. వైసీపీ రక్తచరిత్రకు టీడీపీ సైనికుడిని కోల్పోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడిలో గాయపడిన రామకృష్ణ కుమారుడు సురేశ్‌కు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్