సంకటహర చతుర్థి అనేది హిందూ మతంలో గణేశుడికి అతి ముఖ్యమైన పండుగ. దీనిని ప్రతి నెల కృష్ణ పక్ష చతుర్థి తిథి రోజున జరుపుకుంటారు. అయితే ఆ రోజున కొన్ని వస్తువులను దానం చేస్తే మంచిదని పురోహితులు చెబుతున్నారు. పేదలకు, అవసరంలో ఉన్నవారికి కొత్తవి లేదా శుభ్రమైన దుస్తులను దానం చేయాలి. అవసరమైతే ధాన్యాలను దానం కూడా చేయవచ్చు. జంతువులకు ఆహారాన్ని దానం చేయాలి.నెయ్యిని దానం చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుందని నమ్మకం.