గాజాపై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 85 మంది మరణించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. రెండు రోజుల క్రితం జరిపిన దాడుల్లో 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ఎక్కువగా పౌరులే ఉన్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగియడంతో ఇజ్రాయెల్ దాడులతో చెలరేగిపోతోంది.