టాలీవుడ్‌లో నటించాలంటే కష్టం: సంయుక్త మీనన్

63చూసినవారు
టాలీవుడ్‌లో నటించాలంటే కష్టం: సంయుక్త మీనన్
టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కొంత కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న సంయుక్త స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ 'మలయాళంతో పోలిస్తే తెలుగులో నటించడం చాలా కష్టం. భాష రాకపోవడం ఒక కారణమైతే.. మేకప్ మరో కారణం. మలయాళ సినిమాల్లో మేకప్ చాలా సహజంగా వేస్తారు. యాక్టింగ్ చేసేటప్పుడు కూడా స్వేచ్ఛ ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ తెలుగులో షాట్ చేస్తున్నప్పుడల్లా మేకప్ వేసుకోవాలి' అని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్