సిఎం స్థాయి వ్యక్తి గాలి మాటలు మాట్లాడటం సరికాదు: హరీష్

54చూసినవారు
సిఎం స్థాయి వ్యక్తి గాలి మాటలు మాట్లాడటం సరికాదు: హరీష్
పార్లమెంటు ఎన్నికల్లో BRS, BJP బిజెపి కుమ్ముక్కు అయ్యాయని CM రేవంత్ ఢిల్లీలో ఆరోపించడం విడ్డూరమని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ లో బిజెపిని BRS పార్టీయే గెలిపించిందని సిఎం స్థాయి వ్యక్తి గాలి మాటలు మాట్లాడటం సరికాదన్నారు. మెదక్ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే అందులో 3 చోట్ల BRS మెజారిటీ సాధించిందని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో బీజేపీకి మెజారిటీ వచ్చింది. రేవంతే అక్కడ బిజెపికి కాంగ్రెస్ ఓట్లు మళ్లించారా? అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్