మన సత్తాపై ‘అణు’మానాలు తీరిన రోజు

1547చూసినవారు
మన సత్తాపై ‘అణు’మానాలు తీరిన రోజు
సరిగ్గా 50 ఏళ్ల కిందట ఇదే రోజు భారత్‌ తన తొలి అణు పరీక్షను నిర్వహించింది. తద్వారా ఆ సత్తా చాటిన అమెరికా, సోవియట్‌ యూనియన్, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాల సరసన సగర్వంగా నిలిచింది. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వంలేని దేశం అణు పరీక్ష నిర్వహించడం అదే మొదటిసారి. అణు పరీక్ష నిర్వహించిన ప్రపంచంలో ఆరవ దేశంగా అవతరించింది. దీనిపై అగ్గిమీద గుగ్గిలమైన కొన్ని అగ్రరాజ్యాలు ఆంక్షలతో అక్కసు వెళ్లగక్కాయి. అయినా మన దేశం నిలదొక్కుకుంది. సాంకేతిక పురోగతితో ముందడుగు వేసింది.

సంబంధిత పోస్ట్