తమిళనాడులో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఆటో డ్రైవర్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డుపై సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్న పిల్లాడిని సరాదాగా కొట్టాడు. దీంతో ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.