తెలంగాణ ఇంటర్‌లో విద్యార్థుల ప్రవేశాలకు ఆన్‌లైన్ విధానం అమలు చేయాలని గతంలో ఇంటర్ విద్యాశాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే రానున్న విద్యా సంవత్సరం అమలు చేయడం లేదని తాజాగా స్పష్టం చేసింది. ఆన్‌లైన్ విధానం అమలు చేయాలంటే ప్రైవేట్ జూ.కళాశాలలకు గ్రేడింగ్ ఇవ్వడంతో పాటు, ఫీజు ఎంతో నిర్ణయించాల్సి ఉంటుంది. బోర్డు అలాంటి పనులేవీ చేయనందున, వచ్చే విద్యా సంవత్సరానికి పాత విధానమే కొనసాగించనున్నట్లు తెలిపింది.