TG: తెలంగాణలోనూ టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేస్తాయని ప్రచారం జరుగుతుంది. దీనిపై ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి స్పందించారు. ఆ రెండు పార్టీలతో కలిసి పోటీ చేస్తే తమ పార్టీకే నష్టం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో సొంతంగా ఎదుగుతున్న సమయంలో ఇతర పార్టీల పొత్తు సరికాదన్నారు.