కోల్‌కతా మహిళకు HKU-1 పాజిటివ్‌

59చూసినవారు
కోల్‌కతా మహిళకు HKU-1 పాజిటివ్‌
కోల్‌కతాలోని ఓ మహిళ అత్యంత అరుదైన ‘హ్యూమన్‌ కరోనా వైరస్‌’ (HKU-1) బారినపడ్డారు. దీంతో ఆమెను ఐసొలేషన్‌ ఉంచినట్టు వైద్యులు తెలిపారు. 45 ఏండ్ల మహిళ గత 15 రోజులుగా జలుబు, జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారని, దక్షిణ కోల్‌కతాలోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని తెలిసింది. HKU-1 కరోనా వైరస్‌లోని ‘బీటా కరోనా వైరస్‌ హాంకానెన్స్‌’ రకానికి చెందినదని, ఈ వైరస్‌కు ప్రత్యేక చికిత్స, వ్యాక్సిన్‌ గానీ లేదు.

సంబంధిత పోస్ట్