సీనియర్ నటుడు జగపతి బాబు ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్‌లో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో అమని కూడా నటిస్తోంది. అయితే తాజాగా సెట్స్‌లో అమనికి టచ్ అప్ చేశారు. చేతిలో గొడుగు పట్టుకుని అమనికి మేకప్ వేశారు. దీనిని అక్కడే ఉన్న కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాని కింద 'నా భార్య నన్ను కోటి రూపాయలకు అమ్మక ముందు' అనే క్యాప్షన్ ఇచ్చారు. అయితే వీరిద్దరూ కలిసి శుభలగ్నంలో నటించిన విషయం తెలిసిందే.