జగదీశ్ రెడ్డి జైలుకు పోవడం ఖాయం: మంత్రి కోమటిరెడ్డి

224173చూసినవారు
జగదీశ్ రెడ్డి జైలుకు పోవడం ఖాయం: మంత్రి కోమటిరెడ్డి
జగదీష్ రెడ్డి చావు తప్పి కన్ను లొట్ట పోయి గెలిచాడని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.. ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోలేని అసమర్థ నాయకుడని, ముగ్గురుని హత్య చేసిన కేసులో నిందితుడు, హంతకుడు అని ఆయన ఆరోపణలు చేశారు. రేపో మాపో జగదీశ్ రెడ్డి జైలుకు పోవడం ఖాయమన్నారు. 80 ఎకరాల ఫామ్ హౌస్ ఎలా కట్టాడని ప్రశ్నించారు. జగదీశ్ రెడ్డికి సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం చుట్టూ 150 ఎకరాల భూములు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్