ధర్మపురిలో ఘనంగా పోచమ్మ బోనాలు

78చూసినవారు
ధర్మపురిలో ఘనంగా పోచమ్మ బోనాలు
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో అంబేద్కర్ సంఘం ధర్మపురి జడ్పిటిసి బత్తిని అరుణ ఆధ్వర్యంలో గ్రామ దేవత పోచమ్మ తల్లికి బోనాలు ఘనంగా గురువారం నిర్వహించారు. ప్రతి ఇంటి నుంచి అంబేద్కర్ కాలనీ కి చెందిన మహిళలు బోనాన్ని ఎత్తుకొని డప్పు చప్పుళ్ల నడుమ పోచమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, పోచమ్మ తల్లిని వేడుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్