వెల్గటూరు మండలం శాఖాపూరు గ్రామంలో బోడకుంట అశోక్ వ్యవసాయ క్షేత్రంలో వరి ధాన్యం దిగుబడి అంచనా వేసేందుకు గాను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం వరి పంట కోత ప్రయోగం కార్యక్రమాన్ని నిర్వహించారు. పొలంలో 5 మీటర్ల వెడల్పు, 5 మీటర్ల పొడవు వైశాల్యంతో వరి పంటను కోసి అక్కడే నూర్పిడి చేసి, తూకం వేయగా సన్నపు రకం వరి ధాన్యం కిలోల 13: 540 గ్రాములు బరువు దిగుబడి వచ్చిందని వ్యవసాయ శాఖ తెలిపింది.