బీర్పూర్ మండలం తుంగూరు ఎస్టీ కాలనీ, కందెనకుంట గ్రామంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎంపీ ఫండ్ ద్వారా మంజూరైన ఐమాక్స్ లైట్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ బోగ శ్రావణి శనివారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీర్పూర్ మండల అధ్యక్షుడు ఆడెపు నర్సయ్య, బీర్పూర్ మండల ఇన్‌చార్జ్ పాత రమేష్, మండల ప్రధాన కార్యదర్శి కందుకూరి లక్ష్మణ్, నాయకులు పాల్గొన్నారు.