కొండగట్టులో 100 గదుల నిర్మాణానికి స్థల పరిశీలన చేసిన టీటీడీ

74చూసినవారు
కొండగట్టులో 100 గదుల నిర్మాణానికి స్థల పరిశీలన చేసిన టీటీడీ
జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో 100 గదుల నిర్మాణానికి టీటీడీ ఇంజనీరింగ్ అధికారుల బృందం శనివారం కొండగట్టుకు వచ్చారు. ఈ సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వారికి స్వాగతం పలికి 100 గదుల నిర్మాణానికి ఆలయ అధికారులతో స్థల పరిశీలన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ టీజీ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల సహకారంతో కొండగట్టును అభివృద్ధి చేసుకుంటామని చెప్పారు.

సంబంధిత పోస్ట్