మెట్ పల్లి పట్టణంలోని ఓ దుకాణం ముందు ఈ నెల 7న మూడు లక్షల రూపాయలు రోడ్డుపై పడి ఉండగా దుకాణం యజమానులు సామ మారుతి, కంభంపాటి కిరణ్ కుమార్ ఆ డబ్బును సీఐ నిరంజన్ రెడ్డికి అప్పగించారు. పోలీసుల విచారణలో హఫీజ్ తన బ్యాగ్ నుండి డబ్బులు పడిపోయినట్లు ధృవీకరించుకొని సీఐ బుధవారం ఆ డబ్బును హఫీజ్ కు తిరిగి అప్పగించారు.