మెట్పల్లి మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ జి సత్య ప్రసాద్ సమగ్ర కుటుంబ సర్వే యొక్క ఆన్లైన్ డేటా ఎంట్రీ ఆపరేటింగ్ ను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ సమగ్ర కుటుంబ సర్వే చేసినటువంటి వివరాలను ఆన్లైన్ డేటా ఎంట్రీ ఆపరేటింగ్ త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి మోహన్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.