డిసెంబర్ 13 న మెట్ పల్లి పట్టణం నుండి అరుణాచలం కు ప్రత్యేక ఆర్టీసీ బస్సు నడుపుతున్నట్టు డిపో మేనేజర్ టి. దేవరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. బస్సు కోరుట్ల, కరీంనగర్, మీదుగా వెళ్లి 14 వ తేదీ ఉదయం 7 గంటలకు కానిపాఖం, సాయంత్రం 5 గంటలకు వెల్లూరు లోని గోల్డెన్ టెంపుల్ అనంతరం 15 వ తేదీ పౌర్ణమి రోజున అరుణాచలం చేరుకుంటుందని అన్నారు. పూర్తి వివరాలకు 9948941541, 7382850971, 9154298574, 9533006606 సంప్రదించవచ్చు.