హైదరాబాద్‌లోని ఒక గల్ఫ్ మెడికల్ సెంటర్‌లో వైద్య టీకా వేయించుకొని సౌదీకి వెళ్లిన ఓ యువకుడు టీకా వికటించి నరకయాతన అనుభవిస్తున్నాడు. బాధితుడి తల్లి లక్ష్మి విదేశాంగ శాఖకు ఫిర్యాదుతో గురువారం విషయం వెలుగుచూసింది. కోరుట్ల మండలం సంగెం గ్రామానికి చెందిన పోతుగంటి చంద్రశేఖర్ జూన్ 24న హైదరాబాద్‌లోని గల్ఫ్ మెడికల్ సెంటర్‌లో వైద్య పరీక్షలతో పాటు టీకా వేయించుకున్నాడు.
జూలై 11న జాబ్ వీసాపై సౌదీ అరేబియాలోని ఆల్-బాద్ తాబూక్‌కు ఫ్యామ్కో కంపెనీ నియోమ్ ప్రాజెక్ట్‌లో క్లీనింగ్ సూపర్‌వైజర్‌గా పనిచేసేందుకు వెళ్లాడు. కొన్నిరోజుల తర్వాత టీకా ఇంజక్షన్‌తో కుడి భుజంలో ఇన్ఫెక్షన్ అయింది. చికిత్స కోసం ఇండియాకు పంపించాలని మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని చంద్రశేఖర్ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.