కరీంనగర్: ప్రతిమ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
కరీంనగర్ పట్టణంలోని రాంనగర్ లోగల ప్రతిమ అర్బన్ సెంటర్లో ఆదివారం ఉచిత సూపర్ స్పెషాలిటీ మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వైద్య శిబిరానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. రోగులు ఇక్కడికి వచ్చి ఉచితంగా పరీక్షలు చేసుకున్నారు. వైద్య శిబిరం ఇంచార్జి సంపత్ రావు హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ దిండిగాల మహేష్ నాయకులు ఒడ్నాల రాజు తదితరులు పాల్గొన్నారు.