తమిళనాడులోని మధురైలో జల్లికట్టు పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. సంక్రాంతి సందర్భంగా మూడు రోజులు ఈ పోటీని నిర్వహిస్తారు. అవనియాపురం గ్రామంలో తొలిరోజు ఆట మొదలైంది. ఇందులో 1,100 ఎద్దులు, 900 మంది వ్యక్తులు పాల్గొంటున్నారు. అయితే, ఈ పోటీలో మొదటి ఫ్రైజ్ గెలిచిన ఎద్దు యజమానికి రూ.11 లక్షల ట్రాక్టర్, ఎద్దును అదుపు చేసిన వ్యక్తికి రూ.8 లక్షల నిస్సాన్ కారు అందజేయనున్నారు. ఇక, వేడుకలకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు.