జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ సీఎం మెహబూబా ముఫ్తీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆమె నేతృత్వంలోని జమ్మూ కశ్మీర్ పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి సుహైల్ బుఖారీ మంగళవారం పార్టీకి రాజీనామా చేశారు. తాను పీడీపీ నుంచి వైదొలిగినట్లు సుహైల్ బుఖారీ వెల్లడించారు. రాజీనామాకు గల కారణాలను ఆయన వెల్లడించలేదని తెలుస్తోంది.