పల్లెలకు వెళ్లి స్థిరపడే ఒంటరి మహిళలకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వనున్న జపాన్

1542చూసినవారు
పల్లెలకు వెళ్లి స్థిరపడే ఒంటరి మహిళలకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వనున్న జపాన్
జపాన్ రాజధాని టోక్యో నుంచి గ్రామీణ ప్రాంతాలకు మకాం మార్చే ఒంటరి మహిళలకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించేలా జపాన్ కొత్త పథకాన్ని సిద్ధం చేసింది. విద్యా, ఉద్యోగాల కోసం టోక్యోకు వచ్చే మహిళలు అక్కడే స్థిరపడుతున్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో పురుషులతో పోలిస్తే ఒంటరి మహిళల సంఖ్య తగ్గిపోతుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆ మహిళలు పెళ్లి సంబంధాలు చూసుకోవడానికి అవసరమైన ప్రయాణ ఖర్చులను ప్రభుత్వం భరించనుంది.

సంబంధిత పోస్ట్