ఇటలీ టెన్నిస్ ప్లేయర్ జాస్మిన్ పావోలినీ చరిత్ర సృష్టించారు. తన దేశం తరఫున వింబుల్డన్ ఫైనల్‌కు చేరిన తొలి మహిళగా నిలిచారు. క్రొయేషియాకు చెందిన డొన్నా వెకిక్‌పై 2-6, 6-4, 7-6(10/8) స్కోర్‌తో ఆమె విజయం సాధించారు. గత నెలలో జరిగిన ఫ్రెంచి ఓపెన్లోనూ రన్నరప్‌గా నిలిచారు. ఇక శనివారం జరిగే ఫైనల్లో 31వ సీడ్ బార్బొరా క్రెజ్సికోవాను జాస్మిన్ ఎదుర్కొంటారు.