CPR చేసి రెండేళ్ల చిన్నారిని కాపాడిన జవాన్ (వీడియో)

60చూసినవారు
తల్లిదండ్రులతో కలిసి తాజ్ మహల్ చూసేందుకు వచ్చిన రెండేళ్ల చిన్నారి ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయింది. దీంతో అంబులెన్సులో ఆస్పత్రికి తరలిస్తున్న చిన్నారికి అక్కడే ఉన్న CISF జవాన్ CPR చేసి ప్రాణాలు కాపాడారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉంది. కర్ణాటకలోని బెలగాంకు చెందిన ఈ చిన్నారి గుక్కపట్టి ఏడవడంతో హైపోక్సియాతో అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్