ప్రజ్వల్‌పై చర్యలకు జేడీఎస్‌ సిద్ధం

71చూసినవారు
ప్రజ్వల్‌పై చర్యలకు జేడీఎస్‌ సిద్ధం
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై వేటు వేసేందుకు జేడీ(ఎస్‌) సిద్ధమైంది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి తెలిపారు. మంగళవారం జరిగే పార్టీ కోర్‌ కమిటీ సమావేశంలో దీన్ని ప్రతిపాదిస్తామని తెలిపారు. ఈ విషయాన్ని జేడీఎస్‌ జాతీయ అధ్యక్షుడు దేవేగౌడకు విన్నవించామని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్