400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్లతో అతిపెద్ద ఎయిర్‌పోర్టు

73చూసినవారు
400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్లతో అతిపెద్ద ఎయిర్‌పోర్టు
దుబాయ్‌ వరల్డ్‌ సెంట్రల్‌’లోని అల్‌ మక్తూమ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో రూ.2.9లక్షల కోట్లతో కొత్త టెర్మినల్‌ నిర్మించనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టుగా నిలువనుంది. ఏడాదికి 26 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు కేవలం రెండు రన్‌వేలు ఉన్నాయి. 400 ఎయిర్‌క్రాఫ్ట్‌ గేట్లు, ఐదు సమాంతర రన్‌వేలు ఉంటాయి. ఈ ఎయిర్‌పోర్టు చుట్టూ నగరం నిర్మాణం కాబోతోంది.

సంబంధిత పోస్ట్