విక్రాంత్ హీరోగా నటించిన సబర్మతి రిపోర్ట్ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. గతేడాది విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. కాగా ఈ మూవీని ప్రధాని మోదీ, అమిత్ షా, ఇతర బీజేపీ సీనియర్ నాయకులు వీక్షించి ప్రశంసించారు. కొన్ని రాష్ట్రాల్లో పన్ను మినహాయింపు కూడా కల్పించారు. అయితే ఈ మూవీ జనవరి 10న జీ5లో స్ట్రీమింగ్ కానున్న చిత్ర యూనిట్ తెలిపింది. విక్రాంత్ ఇందులో జర్నలిస్ట్‌గా కనిపించనున్నారు.