రేపటి నుంచి జూనియర్ డాక్టర్ల సమ్మె

21960చూసినవారు
రేపటి నుంచి జూనియర్ డాక్టర్ల సమ్మె
తమ సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే రేపటి నుంచి విధులు బహిష్కరించి సమ్మెకు దిగుతామని తెలంగాణలోని జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. ఈ మేరకు వైద్య విద్య డైరెక్టర్ ఎస్.వాణికి జూడాల సంఘం నేతలు నోటీసులు అందజేశారు. స్టైఫండ్స్ ప్రతి నెలా సమయానికి ఇవ్వాలని, బకాయిలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రత కల్పించాలని, అవుట్ పోస్టులను ఏర్పాటు చేయాలని, ఇతర డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.

సంబంధిత పోస్ట్