క్యాన్సర్‌తో పోరాడుతున్న అభిమానికి జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ (వీడియో)

57చూసినవారు
బోన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న అభిమానికి జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్ చేశారు. ఏపీకి చెందిన కౌశిక్ అనే 19 ఏళ్ల యువకుడు జూనియర్ ఎన్టీఆర్‌కు వీరాభిమాని. ప్రస్తుతం ఆసుపత్రిలో కౌశిక్ చికిత్స పొందుతున్నాడు. తనను సెప్టెంబర్ 27 వరకు బ్రతికించాలని, దేవర సినిమా చూసేంత వరకు తనను కాపాడాలని వైద్యులను వేడుకున్నాడు. ఇది తెలిసిన జూనియర్ ఎన్టీఆర్ ఆ అభిమానికి ఫోన్ చేశారు. క్యాన్సర్ జయించి రావాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్