ఒక్క సెట్టింగ్ చేంజ్ చేస్తే చాలు.. స్కామర్లు మిమ్మల్ని వాట్సాప్ గ్రూపులకు యాడ్ చేయలేరు

595చూసినవారు
ఒక్క సెట్టింగ్ చేంజ్ చేస్తే చాలు.. స్కామర్లు మిమ్మల్ని వాట్సాప్ గ్రూపులకు యాడ్ చేయలేరు
వాట్సాప్ వినియోగదారులకు హానీ కలిగించే స్కామర్లు, అపరిచితులు తమ వాట్సాప్ గ్రూప్ లో మిమ్మల్ని యాడ్ చేయకుండా ఉండేందుకు ఒక సెట్టింగ్ ఉంది. దీని కోసం వాట్సాప్ లో కుడి వైపు ఉన్న 3 చుక్కల్ని క్లిక్ చేసి సెట్టింగ్స్ కు వెళ్లాలి. అనంతరం ప్రైవసీలో 'గ్రూప్స్'లోకి వెళ్లి అక్కడ మిమ్మల్ని ఎవరు యాడ్ చేయొచ్చనే ప్రాధాన్యతను ఎంచుకోవచ్చు. కేవలం మీ కాంటాక్ట్ లను మాత్రమే ఎంచుకుంటే ఇతరులు నేరుగా మిమ్మల్ని గ్రూప్స్ లో యాడ్ చేయలేరు.

సంబంధిత పోస్ట్