నటి కాజల్ అగర్వాల్ ఓ వ్యాపార వేత్తను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పుడు మరోసారి అమ్మగా ప్రమోషన్ పొందనుందని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. దీంతో కాజల్ అగర్వాల్ రెండోసారి తల్లి కాబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె గర్భంతో ఉందని సమాచారం.. అయితే ప్రెగ్నెన్సీపై కాజల్ అగర్వాల్ ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. మరి ఇది ఎంతవరకు వాస్తవమో తెలియాల్సి ఉంది.