ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆదేశం మేరకు రేషన్ షాప్ లలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రాంపూర్ గ్రామంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్ర పటాలకు పాలాభిషేకం చేసి, హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు, యువకులు కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.