వేల్పూర్ మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలు గురువారం శివ గౌరీ రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించినారు. ఈ కార్యక్రమంలో శివ గౌరీ రజక సంఘ సభ్యులు, గ్రామ ప్రజలు, రాజకీయ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.