బోర్లంలో ఘనంగా దుర్గామాత శోభాయాత్ర

74చూసినవారు
బోర్లంలో ఘనంగా దుర్గామాత శోభాయాత్ర
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో ఆదివారం శ్రీ దుర్గామాత నిమజ్జన శోభాయాత్రను భవాని స్వాముల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వేలంపాటలో అమ్మవారి లడ్డు ప్రసాదాన్ని లింగాల సంధ్యారెడ్డి 53 వేల రూపాయలకు దక్కించుకున్నారు. దుర్గామాతకు నవరాత్రులలో అలంకరించిన చీరలను వేలం ద్వారా ప్రసాదంగా భక్తులు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్