రుద్రూర్ మండల కేంద్రంలో మండల పద్మశాలి సంఘం, చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో బుధవారం స్వాతంత్ర సమర యోధులు, తెలంగాణ తొలిదశ, మలి దశ ఉద్యమకారులు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి టెంకాయలు కొట్టి నివాళులు అర్పించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ మరణించేంత వరకు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడారని ఆ సంఘాల అధ్యక్షులు కొనియాడారు.