రుద్రూర్ మండలం సులేమాన్ నగర్ గ్రామంలో సామాజిక ఆర్థిక కులగనణ సర్వేను నిజామాబాద్ అదనపు కలెక్టర్ అంకిత్ బుధవారం పరిశీలించారు. ఆయా గ్రామాల్లో ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు వార్డుల వారీగా విభజన చేసుకుని ఇంటింటికి వెళ్లి కుటుంబ యజమానితో వివరాలు తెలుసుకొని సర్వేలో పొందుపరుస్తున్నారు. ప్రతీ ఒక్కరు తమ వివరాలు అధికారులకు అందించి సహకరించాలని, సర్వేను పూర్తి పారదర్శకంగా, పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించారు.