బాన్సువాడ పట్టణంలో ఇటీవల నూతనంగా ప్రారంభించబడిన న్యూ హోప్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో రేపటి నుండి ఉచిత ఓపి క్యాంప్ నిర్వహిస్తున్నట్లు హాస్పిటల్ యజమాని మహామ్మద్ హబీబ్ తెలిపారు. ఈ ఉచిత ఓపి క్యాంప్ ఈనెల అక్టోబర్ 20 నుండి వచ్చే నెల నవంబర్ 20 తేదీ వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈ ఉచిత ఓపి క్యాంప్ సేవలను బాన్సువాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.