కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంపులో సోమవారం రోజు శాసనసభ్యులు, రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగనన సర్వేను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించి సర్వేకు వచ్చిన వారికి పూర్తి వివరాలను అందించాలని కోరారు.