కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పెద్ద కోడాప్గల్ మండల పరిధిలోగల ప్రభుత్వ షెడ్యూల్ కులాల బాలుర వసతి గృహంలో నిన్న రాత్రి భోజనం చేసిన ఇద్దరు విద్యార్థుల అస్వస్థతకు కారణమైన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ను విధుల్లో నుంచి తొలగించాలని శుక్రవారం వినతి పత్రం అందజేయడం జరిగింది. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని వారు కోరారు.