పంట రుణం ఇవ్వడం లేదని ఓ మహిళ సొసైటీ కార్యాలయం ముందు మంగళవారం నిరసన వ్యక్తం చేసింది. నసురుల్లాబాద్ మండలం, గోపస్పల్లి తాండకు చెందిన అంజు బాయ్ పంట రుణం ఇవ్వడం లేదని భైరవపూర్ సొసైటీ ఎదుట మధ్యాహ్నం రెండు గంటలకు బయట నిరసన వ్యక్తం చేశారు. అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రుణము ఇవ్వకపోతే సొసైటీ ముందు పురుగుల మందు తాగి చచ్చిపోతానని హెచ్చరించింది.