కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాల కళాశాల, దుర్కి గిరిజన బాలికల పాఠశాలలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో మేరా యువ భారత్. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు ఏక్తా దివాస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నసురుల్లాబాద్ ఏఎస్ఐ పటేల్ వెంకట్ రావ్ హాజరయ్యారు.